
సినిమా థియేటర్ల తనిఖీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని సినిమా థియేటర్లను బుధవారం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ తనిఖీ చేశారు. థియేటర్లలో సదుపాయాలపై ఆరా తీశారు. హాల్స్ వద్ద విక్రయించే తినుబండారాల ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. ప్రేక్షకుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెనుగొండలో..
పెనుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు పెనుగొండ మినర్వా థియేటర్ను తహాసీల్దారు జి అనితకుమారి బుధవారం తనిఖీ చేశారు. సైకిల్ స్టాండ్, సినిమా హాలులో తినుబండారాల ధరలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.