● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
గీసుకొండ: నిరంతర పర్యవేక్షణ, పట్టుదల, పశ్నించేతత్వం ఉంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం కోనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన మండలస్థాయి సమీక్షకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మహిళా పొదుపు సంఘాల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అరైవ్ అలైవ్ నినాదంతో ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని, ఎలాంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424కు సంప్రదించవచ్చని సూచించారు. ఎంపీడీఓ కృష్ణవేణి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీఓ పాక శ్రీనివాస్‌లు, ఎంఈఓ రవీందర్, ఇన్‌స్పెక్టర్ డి.విశ్వేశ్వర్, ఏఓ హరిప్రసాద్ బాబు, ఏఈ అనిల్ కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ కమలాకర్, ఏపీఓ చంద్ర కాంత్, ఏపీఎం ఈశ్వర్, సర్పంచ్‌లు వీరగోని రాజకుమార్, రడం భరత్, పేర్ల శ్రవణ్, కన్నెబోయిన యమున ప్రవీణ్, గాలి యాక య్య, వీరేందర్, వీరన్న, స్వరూప, దివ్యభారతి, మౌనిక, అర్పిత, మానస, ఆర్‌ఐలు సాంబయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


