మరుగుదొడ్లను పట్టించుకోరా?
● నిర్వహణ సక్రమంగా ఉండాలి
● నగర మేయర్
గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: రూ.లక్షలు వెచ్చించి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం.. వృథాగా వదిలేస్తే ఎలా అంటూ నగర మేయర్ గుండు సుధారాణి ప్రజారోగ్య విభాగం అధికారులను మందలించారు. గురువారం వరంగల్ ఫైర్ స్టేషన్‌ను ఆనుకొని ఉన్న పబ్లిక్ టాయిలెట్ల స్థితిగతులను మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం కేటాయించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని పేర్కొన్నారు. అనంతరం పోతననగర్‌లోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను పరిశీలించారు. ఎన్ని కంటైనర్లు పనిచేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. కంటైనర్లు మరమ్మతులకు గురైతే వెంటనే పునరుద్ధరించాలని, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచాలని, ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటాలని మేయర్ సూచించారు. ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు పసునూరి భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు.


