మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనంను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్‌లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్‌ఐ ప్రతిభ, ఆర్‌ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, సురేశ్, దామోదర్‌యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్ఫత్, ఎండీ చాంద్‌పాషా, మహ్మద్ ముగ్ధుం పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
అభివృద్ధి పనులు ప్రారంభం


