అంతర్మథనం
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఎక్కడెక్కడ ఏ పార్టీ స్థానాలు ఎన్నంటే..
పంచాయతీలు 316
కాంగ్రెస్ 198
ఇతరులు
½BÆŠ‡-G‹Ü˘
99
16
నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 23 పెద్ద పంచాయతీలుంటే కాంగ్రెస్ 12, బీఆర్‌ఎస్ 11 స్థానాలను దక్కించుకుంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరిగింది.
వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో నాలుగు పెద్ద పంచాయతీలను కాంగ్రెస్ దక్కించుకుంటే, బీఆర్‌ఎస్ సైతం మూడింటిని సొంతం చేసుకుంది.
రాయపర్తి మండలంలో మూడింటిలో కాంగ్రెస్, ఒకచోట బీఆర్‌ఎస్ రెబల్, మరొక చోట స్వతంత్రులు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం చేసినా పెద్ద పంచాయతీలను బీఆర్‌ఎస్ గెలుచుకోలేకపోయింది.
సంగెం మండలంలోని తొమ్మిది పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ ఐదు, బీఆర్‌ఎస్ మూ డు, బీజేపీ ఒకటి గెలుచుకుంది. గీసుకొండ మండలంలోని రెండు పెద్ద పంచాయతీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్
మద్దతుదారుల విజయం
అయినా.. తప్పని తర్జనభర్జన
పల్లె పోరులో బీఆర్‌ఎస్ పట్టుపై హైరానా
సవాల్‌గా మారనున్న ఎంపీటీసీ,
జెడ్పీటీసీ ఎన్నికలు
పంచాయతీ ఫలితాలపై ముఖ్యనేతల పోస్టుమార్టం
సాక్షి, వరంగల్: జిల్లాలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కొత్త పంచాయితీ తీసుకొచ్చినట్లైంది. 316 పంచాయతీ లకు 198 స్థానాలు దక్కించుకున్నా.. ఏ మాత్రం ప్రభావం లేదని చెప్పిన బీఆర్‌ఎస్ కూడా 98 స్థానాలు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఎక్కడ లోటుపా ట్లు జరిగాయనే విషయాలపై పోస్టుమార్టం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ ఉండేలా చేసేందుకు ఏం చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని గ్రామాల్లో ఈసారి ఎలా సత్తా చాటాలనే అంశాలపై, పార్టీల గుర్తులపై జరిగే ఈ పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి కూడా ఫలితాలపై అభిప్రాయాలు తీసుకొని పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి మండలాల్లోని 51 స్థానాల్లో కాంగ్రెస్ 29, బీఆర్‌ఎస్ 17, ఒకటి బీజేపీ బలపరిచిన అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్రులు గెలిచా రు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచినా.. ఇక్కడ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ముఖ్యనేతలు లేకున్నా కూడా గులాబీ పార్టీ ప్రదర్శన బాగుండడంతో ఎక్కడ లోటుపాట్లు జరిగాయని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. మాజీ ఎమ్మెల్యే అరూరి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత పూర్తిస్థాయిలో పట్టించుకునే నాయకుడు లేకున్నా పల్లెపోరులో మెరుగైన ఫలితాలు రావడం కాంగ్రెస్‌కు షాక్.
నర్సంపేట నియోజవకర్గంలోని 172 స్థానాల్లో 105 పంచాయతీల్లో కాంగ్రెస్, 66 స్థానాల్లో బీఆర్‌ఎస్, ఒక స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా.. ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో 63 స్థానాల్లో 33 పంచాయతీలు కాంగ్రెస్, 27 పంచాయతీలు బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటి, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీలకు 72 కాంగ్రెస్, 33 బీఆర్‌ఎస్, నాలుగు ఇతరులు గెలుచుకున్నారు. మొత్తంగా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకున్నా, ఇక్కడ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకోవడంతో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారంతో జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ బీఆర్‌ఎస్ సీట్లు సొంతం చేసుకుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. జిల్లా మొత్తంగా బీఆర్‌ఎస్‌కు 99 స్థానాలొస్తే ఈ నియోజకవర్గంలోనే 60 స్థానాలు ఉండడం గమనార్హం.
పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాల్లో 53 పంచాయతీల్లో 37 కాంగ్రెస్, 13 బీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. సంగెం మండలంలో 10 స్థానాలు నెగ్గిన బీఆర్‌ఎస్, గీసుకొండలో మూడింటికి మాత్రమే పరిమితమైంది. గీసుకొండ మండలంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సొంతూరు వంచనగిరి ఉండడంతో ఎప్పటి నుంచో వారి ప్రాబల్యం ఉండడం హస్తం పార్టీకి కలిసొచ్చింది. ఎమ్మెల్యే రేవూరి కూడా పల్లెల్లో ఎన్నికల ప్రచారం చేయడం, కొన్నిచోట్ల అభ్యర్థులు వర్గాలుగా పోటీచేసినా విజయం సాధించారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని 40 పంచాయతీ ల్లో 27 స్థానాల్లో కాంగ్రెస్, తొమ్మిది స్థానాల్లో బీఆర్‌ఎస్, నలుగురు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో బీఆర్‌ఎస్ ప్రదర్శన లేదు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ మండలంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించడంతో అధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో హస్తం పార్టీ శ్రేణుల్లో జోష్ ఉంది.
పెద్ద గ్రామ పంచాయతీల్లో ఇలా..
మూడు విడతల్లో కలిపి జిల్లాలోని పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 46 పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ 26 స్థానాలు గెలిస్తే, బీఆర్‌ఎస్ 17 స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ రెబల్ ఒకటి, బీజేపీ ఒకటి, స్వతంత్రులు ఒకటి కై వసం చేసుకున్నారు.
అంతర్మథనం
అంతర్మథనం
అంతర్మథనం


