మైసంపల్లి సర్పంచ్‌గా న్యాయవాది..
● తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు..
కొడుకు సర్పంచ్
దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామ సర్పంచ్‌గా న్యాయవాది వేముల ఇంద్రదేవ్ ఎన్నికయ్యారు. ఇంద్రదేవ్ తండ్రి వేముల సారంగం చాలాఏళ్లుగా గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఎంఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఇంద్రదేవ్ గత కొంతకాలంగా వరంగల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికలు రావడం, రిజర్వేషన్ అనుకూలించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఇంద్రదేవ్ బరిలోకి దిగి ప్రత్యర్థిపై 59 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నుంచి సర్పంచ్ సీటులో కొడుకు ఇంద్రదేవ్ ఆసీనులు కానుండగా ఆయన తండ్రి సారంగం పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేయనున్నారు. అయితే సారంగం మాట్లాడుతూ ప్రజలు అందించిన పదవితో తన కుమారుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తే తాను మాత్రం గ్రామ ప్రజలకు సేవచేసే కార్మికుడిగానే పనిచేస్తానని చెప్పాడు. ఇంద్రదేవ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యారంగంలో విషయంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా పనిచేయడంతో పాటు ప్రజలందరికీ న్యాయ బద్దంగా పాలన అందిస్తానని చెప్పారు.
మైసంపల్లి సర్పంచ్‌గా న్యాయవాది..


