తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మంగళవారం శానిటేషన్ తనిఖీలో భాగంగా వరంగల్‌లోని 25, 26వ డివిజన్లలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. వలంటీర్లు తడి, పొడి చెత్తను వేరుగా అందించడంపై అవగాహన కల్పిస్తున్నారా? వారికి కేటాయించిన ఇళ్లను సందర్శిస్తున్నారా? వంటి విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రెండు కాలనీల్లో పర్యటించి స్వచ్ఛ ఆటోల పనితీరును, 26వ డివిజన్ లక్ష్మీపురంలోని కమేలాను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న పనులు పరిశీలించారు.


