తుది దశకు రెడీ
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, ఇందులో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 102 సర్పంచ్ స్థానాల కోసం 307 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 946 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 137 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 809 స్థానాల కోసం 1,895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో గ్రామ స్థాయి రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. మూడో విడత ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది.
తుది దశకు రెడీ


