పోస్టల్ ప్రొడక్ట్స్, స్టాంప్స్‌పై ఇంటర్న్‌షిప్
నిట్ వరంగల్ విద్యార్థులు పోస్టల్ ప్రాడక్ట్స్, స్టాంప్స్‌పై ఇంటర్న్‌షిప్ చేస్తే ప్రోత్సాహం కల్పిస్తాం. విద్యార్థులు పోస్టల్ సేవల్ని వినియోగించుకునేందుకు జెన్ జెడ్ పోస్టోఫీస్‌ను నిట్ వరంగల్ క్యాంపస్‌లో ఏర్పాటు చేశాం. విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, సిబ్బందికి ఆధునిక టెక్నాలజీతో సేవలందిస్తాం. సెక్యూరిటీ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు పోస్టల్ ప్రమాద బీమాపై అవగాహన కల్పించి ప్రీమియం చెల్లించేలా ఆసక్తి కనబర్చాం. – వి.హనుమంతు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, హనుమకొండ


