జేఈఈ క్యాంపు ప్రారంభం
కమలాపూర్: మండలంలోని గూడూరు శివారు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కళాశాలలో) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఐఓఈ)లో భాగంగా.. జేఈఈ క్యాంపును డీఈఓ గిరిరాజ్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈక్యాంపులో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఉన్న 25 మంది విద్యార్థినులను స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఎంపిక చేశారు. కేజీబీవీ కమలాపూర్‌లో ఈ క్యాంపు మే వరకు కొనసాగుతుందని డీఈఓ తెలిపారు. ఈ క్యాంపులో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జీఈసీఓ సునీత, ఎంఈఓ శ్రీధర్, డీఎస్‌ఓ శ్రీనివాస్‌స్వామి, ఎస్‌ఓ అర్చన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


