మండలాల వారీగా పోలింగ్ శాతం
రాయపర్తి
87.34%
పర్వతగిరి
86.59%
వర్ధన్నపేట
85.65%
కమలాపూర్
72.75%
ఎల్కతుర్తి
86.17%
భీమదేవరపల్లి
82.61%
హన్మకొండ అర్బన్: జిల్లాలో మొదటి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉదయం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్న ఓటర్లకి అధికారులు స్లిప్పులు ఇచ్చి నంబర్లు వేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం వార్డు సభ్యులు, సర్పంచ్ బ్యాలెట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఈక్రమంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులుదీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు చేపట్టిన చైతన్య కార్యక్రమాలు ఫలితాలిచ్చాయని చెప్పవచ్చు.
జిల్లాలో మూడు మండలాల్లో ఓటర్లు 1,28,651
● వీరిలో పురుషులు 62,653
● మహిళలు 65,997
● జిల్లాలో మొత్తం పురుషులు 84.63% ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 83.30% మాత్రమే వినియోగించుకున్నారు.
● థర్డ్ జెండర్ కేటగిరీలో ఒకే ఓటు ఉండగా.. ఆ ఓటు వినియోగించుకోవడంతో ఆ కేటగిరీలో వందశాతం పోలింగ్ అయినట్లు నమోదైంది.
● మూడు మండలాల్లో ఎల్కతుర్తి మండలంలో అత్యధికంగా 86.55% పోలింగ్ నమోదైంది. భీమదేవరపల్లిలో తక్కువగా 82.61%,
● జిల్లాలో మొత్తం 1,08,003 ఓట్లు పోలయ్యాయి.
● వీరిలో పురుషులు 53,026, మహిళలు 54,976
ౖవైద్య సేవలు తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
మండలవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. కానిపర్తి, శంభునిపల్లిలోని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలను డీఎంహెచ్‌ఓ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నాగరాజు, డాక్టర్ అరుణ్, హెచ్‌ఈఓ రవీందర్, టీబీ నోడల్ పర్సన్ ప్రభాకర్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రెండో స్థానంలో బీఆర్‌ఎస్, 56 మంది ఇతరుల
విజయం
స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మంతనాలు
తొలి విడతఓటింగ్ జరిగిందిలా..
హనుమకొండ జిల్లా..
మండలం ఓటర్లు ఓటేసినవారు
భీమదేవరపల్లి 40,897 33,783
ఎల్కతుర్తి 31,915 27,621
కమలాపూర్ 55,839 46,599
మరిన్ని ఎన్నికల వార్తలు : 10, 11లో..
మండలాల వారీగా పోలింగ్ శాతం
మండలాల వారీగా పోలింగ్ శాతం
మండలాల వారీగా పోలింగ్ శాతం


