ఉపసర్పంచ్‌పై ఎంపీడీఓకు ఫిర్యాదు
సంగెం: మండలంలోని పెద్ద తండా ఉపసర్పంచ్ రవీందర్‌పై వార్డు సభ్యులు, గ్రామస్తులు ఎంపీడీఓ రవీందర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న ఉపసర్పంచ్ ఎన్నిక జరిగింది. ఆ సమయంలో తనకు ఓటు వేయాలని వార్డు సభ్యురాలు మంగమ్మను బెదిరించాడని, మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న ఆమె కుమారుడిని తొలగిస్తానని రవీందర్ బెదిరించాడని ఫిర్యాదు చేశారు. వార్డు సభ్యులు నున్సావత్ విమల, భూక్యా ఆనంద్‌కుమార్, గుగోలోత్ మల్కి, మంజులతోపాటు స్థానికులు నున్సావత్ దేవ్‌సింగ్, గుగులోత్ రమేశ్, జాటోత్ సురేశ్ తదితరులు ఫిర్యాదు చేశారు.
ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలి
నర్సంపేట రూరల్: ఒక్కో వైద్య విద్యార్థి గ్రామంలో ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలని నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ సూచించారు. మహేశ్వరం గ్రామంలో 2025–26 మొదటి బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో కుటుంబ దత్తత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. వైద్య విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, ప్రజల ఆరోగ్య పరిస్థితి, పరిసరాలు, ఇతర వివరాలను సేకరించి వారి ఆరోగ్యస్థాయిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత, డాక్టర్ సుచరిత, మహేందర్‌రెడ్డి, విజయకుమార్, పద్మజ, అశోక్, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
టెట్ నుంచి మినహాయించాలి
విద్యారణ్యపురి: ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశం హనుమకొండలోని సామ జగన్మోహన్ స్మారక భవన్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ.. టెట్ మినహాయింపుపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ, ఎన్‌సీటీఈ చైర్మన్, కేంద్రంలోని విద్యాశాఖ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ టీపీయూఎస్ అధ్యక్షుడు బత్తిని వెంకటరమణగౌడ్, టీపీయూఎస్ రాష్ట్ర నాయకులు చిదురాల సుధాకర్, పిన్నింటి బాలాజీరావు, దాస్యం రామానుజస్వామి, ఆముదాల దాత మహర్షి, రెండు జిల్లాల్లోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు టీపీయూఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపసర్పంచ్‌పై ఎంపీడీఓకు ఫిర్యాదు


