23 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
సాక్షి, వరంగల్: జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 11 మండలాల్లోని 317 పంచాయతీల్లో 23 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,754 వార్డుల్లో 449 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. పర్వతగిరి మండలంలో మూడు, రాయపర్తి మండలంలో 6, వర్ధన్నపేటలో రెండు, దుగ్గొండిలో ఒకటి, గీసుకొండలో రెండు, సంగెంలో రెండు, నెక్కొండలో ఐదు, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో ఒక్కో సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. అలాగే, పర్వతగిరి మండలంలో 75 వార్డులు, రాయపర్తిలో 108 వార్డులు, వర్ధన్నపేటలో 32 వార్డులు, దుగ్గొండిలో 18 వార్డులు, గీసుకొండలో 26 వార్డులు, నల్లబెల్లిలో 18 వార్డులు, సంగెంలో 35 వార్డులు, చెన్నారావుపేటలో 35 వార్డులు, ఖానాపురంలో 14 వార్డులు, నర్సంపేటలో 6, నెక్కొండ మండలంలో 82 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఎంతమంది బరిలో ఉన్నారంటే..
● మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీలో ఉన్నారు.
● దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో 117 సర్పంచ్ స్థానాలకు ఐదు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 111 స్థానాలకు 360 మంది బరిలో ఉన్నారు. 1,008 వార్డులకు 97 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 906 వార్డులకు 2,142 మంది బరిలో ఉన్నారు.
● చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో 109 పంచాయతీలకు ఏడు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 102 స్థానాలకు 307 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 946 వార్డులకు 137 ఏకగ్రీవమైతే మిగిలిన 809 వార్డులకు 1,895 మంది పోటీలో ఉన్నారు. మూడో విడతలో 310 మంది సర్పంచ్ అభ్యర్థులు, 616 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.


