ఎన్నికల సిబ్బంది కేటాయింపు
న్యూశాయంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత మూడో ర్యాండమైజేషన్, మూడో విడత రెండో ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ సమక్షంలో కలెక్టరేట్‌లో బుధవారం ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల మేరకు పీఓలు, ఓపీఓలు, మైక్రోఅబ్జర్వర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. రెండో విడతలో దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం, మూడో విడతలో ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించారు. డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు.


