రేవంత్ పాలనలో అంతా విధ్వంసమే
విజయ్ దివస్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
హన్మకొండ: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అంతా విధ్వంసమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.


