గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం

Dec 9 2025 6:56 AM | Updated on Dec 9 2025 6:56 AM

గ్లోబ

గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం

నర్సంపేట రూరల్‌: తెలంగాణ రాష్ట్ర రైసింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కా ర్యక్రమంలో అ మీనాబాద్‌ గ్రామానికి చెందిన ఊరుగొండ సాయికుమార్‌ పాల్గొన్నాడు. న్యూట్రిషన్‌లో జూనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సాయికుమార్‌కు సీఎం కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ గ్లోబల్‌ సమ్మిట్‌లో సాయికుమార్‌ పాల్గొన్నారు.

జాబ్‌ మేళా వాయిదా

కాళోజీ సెంటర్‌: సీఎస్సీ హెల్త్‌కేర్‌ సంస్థలో నియామకాలకు నిర్వహించనున్న జాబ్‌ మేళా వాయిదా వేసినట్లు ఇంటర్‌ విద్యాశాఖ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున సీఎస్సీ సంస్థ డివిజన్‌ మేనేజర్‌ హరీష్‌ సూచన మేరకు నర్సంపేట ఎస్‌ఆర్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో నేడు (మంగళవారం) నిర్వహించనున్న జాబ్‌ మేళా వాయిదా వేశామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత, ఉన్నతాధికారుల అనుమతి మేరకు తదుపరి తేదీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

గీసుకొండ: మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను మామునూరు ఏసీపీ వెంకటేశ్‌ పరి శీలించారు. గీసుకొండ, వంచనగిరి, శాయంపేట, ఊకల్‌, మరియపురం, కొనాయమాకుల, గీసుకొండ, రాంపురం, మనుగొండలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు, పోలింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జ రిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌, ఎస్సై కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

‘గ్రీన్‌ఫీల్డ్‌’ పనులు అడ్డగింత

పర్వతగిరి: గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులను అధికారులు మోసం చేశారని ఆరోపిస్తూ సోమవారం పనులను అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా బాధిత రైతు దంశెట్టి నర్సింగం మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఆర్బిట్రేషన్‌ అమౌంట్‌ విషయంలో కలెక్టర్‌, ఆర్డీఓలతో మాట్లాడి ఇప్పిస్తామని తెలిపినప్పటికీ.. అలా కాకుండా భూములను స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఈ విషయమై చట్ట ప్రకారం బాధిత రైతులకు అవార్డు అమౌంట్‌ ముట్టగానే భూమిని స్వాధీనం చేసుకుంటారని తహసీల్దార్‌ వెంకటస్వామి తెలిపారు.

గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం
1
1/2

గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం

గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం
2
2/2

గ్లోబల్‌ సమ్మిట్‌కు అమీనాబాద్‌ యువకుడికి ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement