అందుబాటులో యాసంగి విత్తనాలు
న్యూశాయంపేట: జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం పంటల సరళి, విత్తనాలు, ఎరువుల లభ్యత, అమ్మకాలపై కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి 1,15,200 ఎకరాలు, మొక్కజొన్న 1,08,500 ఎకరాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగు చేయనున్నారని, అందుగు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబర్ 2025 నుంచి ఇప్పటివరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా చేశారని, ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద 3,660 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 498 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 266 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి
వరంగల్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్‌లోని పైడిపల్లి, దేశాయిపేట, తిమ్మాపూర్, దూపకుంట ప్రాంతాల్లో డబూల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ ఇళ్లలో శుభ్రత, నీటి సరఫరా, విద్యుత్ పనుల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్, ఆర్డీఓ సుమా, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, బల్దియా ఈఈలు సంతోష్‌బాబు, మహేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
కలెక్టర్ సత్యశారద


