వైభవంగా అయ్యప్ప పల్లివేట
నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా ఆధ్వర్యంలో సోమవారం పల్లివేట కార్యక్రమం వైభవంగా సాగింది. కేరళలోని శబరిమలై సమీపంలోని పుంగవనంలో నిర్వహించే తీరుగా పల్లివేట కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలో గురుస్వాములతో కలిసి పూజలు నిర్వహించారు. 25వ మండల పూజామహోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని క్షేత్ర బలి, ఉత్సవ బలి, పల్లివేట కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, సర్వ సైన్యాధ్యక్షుడు అచ్చ దయాకర్ పాల్గొని పుష్పాభిషేకం, పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాల మధ్య శోభాయాత్ర ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పుంగవనం (కుటీరం)లో నిర్వహించిన పల్లివేట ఉత్సవం భక్తులు, మాలదారులను ఆకట్టుకుంది. అనంతరం అష్టోత్తర పూజలు చేసి హారతి ఇవ్వడంతో పల్లివేట ముగిసింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్‌నాయక్, ఆలయ అధ్యక్షుడు సైఫ సురేష్, కార్యదర్శి చింతల కమలాకర్‌రెడ్డి, మాదారపు చంద్రశేఖరం, శ్రీరాం ఈశ్వరయ్య, శ్రీరాముల శంకరయ్య, దొడ్డ రవీందర్, వంగేటి గోవర్ధన్, చకిలం కృష్ణమూర్తి, పిన్నా రామనాధం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహారాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీనివాస్, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, గడ్డం ఆంజనేయులు, ములుగు జిల్లా నాయకులు కృష్ణవేణి, భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు
వైభవంగా అయ్యప్ప పల్లివేట


