
సాగునీరు విడుదల
వీపనగండ్ల: మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్ నుంచి శనివారం అధికారులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కాల్వలకు సాగునీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ అవుట్ ఫాల్ గేట్లను ఎత్తడంతో మండలంతో పాటు చిన్నంబావి మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరు అందుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం ఉమ్మడి మండలంలోని రైతులు సకాలంలో వరి తుకాలు పోసుకునేందుకు వీలుగా నీటిని విడుదల చేసినట్లు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్‌యాదవ్, మాజీ సర్పంచ్‌లు బీచుపల్లి యాదవ్, రంజిత్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో జూరాల ఇరిగేషన్ డీఈ భావన తదితరులు పాల్గొన్నారు.