బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపిక

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపిక

విజయనగరం టౌన్‌: విజయనగరం జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య 2026–2028కి గాను నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేస్తూ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ డీవీ శ్రీకాంత్‌ గురువారం ప్రకటించారు. సమాఖ్య అధ్యక్షుడిగా భరద్వాజ చక్రవర్తి, కార్యదర్శిగా భోగరాజు సూ ర్యలక్ష్మి, కోశాధికారిగా దామరాజు పర్వతాలు, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ టి.రామారావు, భరద్వాజ ప్రకాష్‌లు ఎంపికయ్యారు. అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా భైరవభట్ల విజయాదిత్య, వెలువర్తి రామకృష్ణలతో పాటు 20 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసినట్లు తెలి పారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని, నిరుపేద విద్యార్థులకు సమాఖ్య తరఫున పూర్తిస్థాయిలో సహకారమందిస్తామన్నారు. ఎంపిక చేసిన సమాఖ్య ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement