మరో దెబ్బ | - | Sakshi
Sakshi News home page

మరో దెబ్బ

Apr 17 2026 11:26 AM | Updated on Apr 17 2026 11:26 AM

న్యూస్‌రీల్‌

విశాఖకు

శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

వరాహ పుష్కరిణిలో బారికేడు ఏర్పాటు

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఆనందపురం : ఆనందపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆశించిన మార్కులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంటర్మీడియట్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పెద్దిపాలెం శ్రీభవిష్య కళాశాలలో చదువుతున్న లోకినిండి తార్కీరావు (18) ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి. బుధవారం విడుదలైన ఫలితాల్లో 470 మార్కులకు గాను 441 మార్కులు వచ్చాయి. తాను ఆశించిన మార్కులు రాలేదని తీవ్రంగా కలత చెందాడు. ఇదిలా ఉండగా, తోటి విద్యార్థులతో పోల్చుతూ తల్లిదండ్రులు మందలించినట్లు తెలిసింది. ఈ పరిణామాలు అతనిపై మానసిక ఒత్తిడిని మరింత పెంచాయి. గురువారం ఉదయం 5.20 గంటల సమయంలో తన క్లాస్‌రూమ్‌లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఆనందపురం సీఐ చింతల వాసునాయుడు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని తండ్రి భగీరధి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ మహానగర ప్రాభవం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా క్షీణిస్తోంది. విశాఖ వైభవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు నగర ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. వైజాగ్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఇక్కడ ఉన్న కీలక కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముందు విశాఖపై అపారమైన ప్రేమను కురిపించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు అన్ని రంగాలను ఇక్కడి నుంచి దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారనడానికి ఈ తరలింపులే సజీవ సాక్ష్యాలు.

సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణను విస్మరించి, అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ మొండివైఖరి వల్ల.. ఇప్పటికే వెనుకబడిన ఉత్తరాంధ్ర మరిన్ని దశాబ్దాలు వెనక్కి మళ్లే ప్రమాదం ఉందన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో కళకళలాడిన నగరం.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా వెలవెలబోతోంది. నగరానికి వస్తుందనుకున్న ఆర్‌బీఐ రీజనల్‌ కార్యాలయాన్ని విజయవాడలోనే ఆపేశారు. ఇక్కడే ఉంటుందనుకున్న జీఎస్టీ ఆడిట్‌ కార్యాలయాన్ని గుంటూరుకు పట్టుకెళ్లిపోయారు. ఇక విశాఖకు దక్కిందనుకున్న మారిటైమ్‌ బోర్డును సైతం అమరావతికి తరలించి విశాఖ వాసుల ఆశలపై నీళ్లు చల్లారు. తాజాగా, దశాబ్దాలుగా ఇక్కడే ఉండి సేవలందిస్తున్న మరికొన్ని కీలక కార్యాలయాలపైనా తరలింపు కుట్రలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

పాతికేళ్ల చరిత్ర కలిగిన కార్యాలయానికి స్వస్తి

నగరంలో 2001 జూన్‌ 19న ఏర్పాటైన కేంద్రీయ భూగర్భ జలమండలి రాష్ట్ర యూనిట్‌ కార్యాలయం, హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంత కార్యాలయం పరిధిలో ఉంటూ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల సుదీర్ఘ తీరప్రాంత జిల్లాల భూగర్భ జలాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కేవలం ఆరుగురు సాంకేతిక అధికారులు, ఇద్దరు పరిపాలన సిబ్బందితోనే గత 25 ఏళ్లుగా ఈ కార్యాలయం సమర్థవంతంగా సేవలను అందిస్తోంది. వేలాది కిలోమీటర్ల తీరప్రాంతం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతంలో నిరంతర సాంకేతిక సహాయం అందిస్తున్న ఈ కార్యాలయాన్ని ఇప్పుడు హఠాత్తుగా తరలించాలను కోవడం వెనుక శాసీ్త్రయ కారణాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరలింపు నిర్ణయం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం ప్రజల హక్కులను కాలరాయడమేనని స్థానికులు మండిపడుతున్నారు.

పరిశోధనలు ఆగిపోతే ఉద్దానం గతేంటి?

తీరప్రాంత జిల్లాల్లో భూగర్భ జలాల నాణ్యత, లభ్యత అనేవి కీలకమైన అంశాలు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో అల్లాడుతోంది. అక్కడి భూగర్భ జలాల్లో సంభవిస్తున్న రసాయన మార్పులు, ఫ్లోరైడ్‌ వంటి తీవ్రమైన సమస్యలపై సీజీడబ్ల్యూబీ కార్యాలయం నిరంతరం శాసీ్త్రయ పరిశోధనలు చేస్తోంది. అంతేకాకుండా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు మండలాల్లో భూగర్భ జలాల వినియోగం మితిమీరిపోయి, నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో విశాఖ కార్యాలయం సకాలంలో స్పందిస్తూ క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందిస్తోంది. ఇప్పుడు ఈ యూనిట్‌ను హఠాత్తుగా విజయవాడకు తరలిస్తే, ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైనా జల సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణమే స్పందించే దిక్కు లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మిగిలిన రాష్ట్రాల్లో రెండు చోట్ల ఆఫీసులు

దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు కార్యాలయాల నమూనాను అనుసరించే అవకాశం కేంద్రీయ భూగర్భ జలమండలికి ఉంది. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుతో పాటు బెళగావిలో కార్యాలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌, పుణేలలో, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో లక్నో, అలహాబాద్‌ ప్రాంతాల్లో రెండేసి కార్యాలయాలు ఉన్నాయి. ఈ నమూనా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడలో కొత్తగా మరొక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ, కొత్త కార్యాలయం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి.. ఉన్న పళంగా ఇక్కడి యూనిట్‌ కార్యాలయాన్ని తరలించాలని చూడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. వరుసగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం వల్ల కేవలం భవనాలు మారడమే కాకుండా, ఆ ప్రాంతానికి అందాల్సిన అభివృద్ధి ఫలాలు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక తోడ్పాటు శాశ్వతంగా దూరమవుతాయి. అభివృద్ధిని రాష్ట్రమంతా వికేంద్రీకరించాల్సింది పోయి, కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలనుకోవడం చంద్రబాబు ప్రభుత్వ చారిత్రక తప్పిదంగా మిగిలిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైజాగ్‌ నుంచి సీజీడబ్య్లూబీ కార్యాలయం తరలింపునకు సన్నాహాలు 2001 నుంచి తీరప్రాంత భూగర్భ జలాల పరిస్థితులపై అధ్యయనం అమరావతిలో ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేసేందుకు అవకాశం కానీ.. ఏకంగా యూనిట్‌ కార్యాలయం తీసుకెళ్లేందుకు యత్నాలు గతంలో ఆర్బీఐ, జీఎస్టీ, మారిటైమ్‌ బోర్డు కార్యాలయాలు తరలింపు

విశాఖలోనే కొనసాగించాలి

నగరంలోని సీజీడబ్ల్యూబీ కార్యాలయాన్ని తరలించి విశాఖ ప్రాధాన్యతను తగ్గించడం కంటే, అమరావతిలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమం. అక్కడ ప్రాంతీయ కార్యాలయం వస్తే.. రాయలసీమ, లోతట్టు జిల్లాల జల సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సుదీర్ఘ తీరప్రాంత జిల్లాల సేవల కోసం విశాఖ యూనిట్‌ను ఇక్కడే కొనసాగించడమే విజ్ఞత అనిపించుకుంటుంది. విశాఖను కేవలం ఒక నగరంగా మాత్రమే చూడకుండా, ఒక శాసీ్త్రయ, ఆర్థిక హబ్‌ గా గుర్తించాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించి, ఈ కార్యాలయాన్ని విశాఖలోనే కొనసాగించాలి. – ప్రొ. కె.ఎస్‌.చలం, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక

Advertisement
 
Advertisement
Advertisement