డాబాగార్డెన్స్ : స్వీయ గణనను ప్రజలు స్వయంగా చాలా సులభంగా చేసుకోవచ్చని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. గురువారం తన నివాసంలో స్వయంగా తన మొబైల్ ఫోన్‌లో httpr://-re.cenrur.gov.in వెబ్‌సైట్ ద్వారా స్వీయ గణన చేసుకుని తన పేరుతో సహా సంబంధిత అంశాలు పొందుపరిచారు. జనగణన–2027లో భాగంగా ప్రభుత్వం సూచించిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఈ నెల 30 వరకు జరుగుతుందన్నారు. తొలిసారిగా సెన్సస్ 2027 కార్యక్రమంలో డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్, ఎన్యుమరేటర్, జీవీఎంసీ సహాయక ఇంజనీర్ మౌనిక పాల్గొన్నారు.


