
ఉత్తరాంధ్రకు చంద్రబాబు తీరని అన్యాయం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
తాటిచెట్లపాలెం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రకు తీరని అన్యా యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం అక్కయ్యపాలెంలోని షాదీఖానాలో విశాఖ ఉత్తర నియోజకవర్గ స్థాయి ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు నాడు హైదరాబాద్, నేడు అమరావతి అని జపం చేస్తున్నారన్నారు. అమరావతి తప్ప చంద్రబాబుకు మరే ప్రాంతాలు గుర్తుకురావడం లేదన్నారు. మళ్లీ ఇప్పుడు అమరావతిలో మరో నలభైవేల ఎకరాల భూసమీకరణకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళాతామని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలోను, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని తెలిపారు. చంద్రబాబు తీసుకొచ్చానని చెప్పుకుంటున్న గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్క్‌లు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే వచ్చాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వా న్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఈ రకమైన వ్యవహారాలు తగవన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. చంద్రబాబు హామీలను నెరవేర్చే వరకు వైఎస్సార్ సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు.