సీతమ్మధార : ఆమె వయసు 94. ఇంట్లో హాయిగా మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేసే వయసు. వృద్ధాప్యాన్ని పక్కన పెట్టి..ఓపిక ఉన్నంతవరకు కష్టపడతానంటోంది. సీతమ్మధార రైతు బజార్‌లో ఓ స్టాల్‌లో గ్రీన్‌పీస్, క్యారెట్ అమ్మూతూ జీవనం సాగిస్తోంది. భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన వృద్ధ రైతు పేరు నారాయణమ్మ. అందరూ శబరి అని పిలుస్తారు. ఇప్పటికీ ఎంతో హుషారుగా రైతు బజార్‌కు వచ్చి వెళుతుంటుంది. 20 ఏళ్లుగా సీతమ్మధార రైతు బజార్‌లో గ్రీన్‌పీస్, క్యారెట్ విక్రయాలు జరుపుతూ అందరికీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. భర్త మృతి చెందగా..ఐదుగురు సంతానం. ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చదు..అందుకే ఇప్పటికీ రైతు బజార్‌లో విక్రయాలు జరుపుతున్నానని శబరి చెప్పింది. రైతు బజార్‌కు వచ్చినవాళ్లంతా ఆమెను చూసి వహ్వా..అవ్వా అంటూ శబరి వద్ద కొనుగోలు చేస్తున్నారు.