 
															స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్‌లో కళాశాలల బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం అక్బర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో రూ.8,150 కోట్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తేజ, రాకేష్, సిద్దు, రెహాన్, జునేద్, అఖిల్, రాజు, ఇస్మాయిల్, దీపక్, చందు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందుల్లో విద్యార్థులు
పరిగి: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నేత అనిల్ అన్నారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు మేరకు పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని కళాశాల బంద్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు శివ, అరుణ్, రియాజ్, రేహాన్, ఇర్ఫాన్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
