
కల్కి భూములపై విచారణ
వరదయ్యపాళెం: ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సమీపంలోని వివాదాస్పద కల్కి ట్రస్టు భూములకు సంబంధించి బుధవారం రెవెన్యూ , అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో ఈ భూములకు సంబంధించి కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు కల్కి ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక రైతులతో సర్వే డీఐ ప్రసాదరావు, అటవీశాఖ అధికారులు సమావేశమయ్యారు. సంబంధిత భూములు కల్కి ట్రస్టుకు ఎలా చెందాయో వివరాలను పరిశీలించారు. అలాగే స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని సర్వే అధికారులు తెలిపారు.