Telangana: కొత్తగా 106 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 9662 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, వారిలో 106 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.35 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 151 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.30 లక్షలకు చేరింది. ప్రస్తుతం 888 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.