Hyderabad: ఎంగేజ్‌ విత్‌ సిటీ... | Engage with City | Sakshi
Sakshi News home page

Hyderabad: ఎంగేజ్‌ విత్‌ సిటీ...

Jun 25 2024 8:59 AM | Updated on Jun 25 2024 8:59 AM

Engage with City

డిస్రప్టివ్‌ ఇన్నోవేటర్స్‌ డ్రైవింగ్‌ ఛేంజ్‌ లీగ్‌ అవార్డులు..

దేశవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న మారికో ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ ఇండియా అవార్డ్స్‌’ అందించనున్నారు. డిస్రప్టివ్‌ ఇన్నోవేటర్స్‌ డ్రైవింగ్‌ ఛేంజ్‌ లీగ్‌లో భాగంగా సామాజిక, పర్యావరణ, ఆర్థిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు జాతీయ అవార్డులను అందించనున్నామని మారికో ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు హర్‌‡్ష మారివాలా తెలిపారు.

 ఈ ప్రతిష్టాత్మక పదో ఎడిషన్‌లో భాగంగా దేశంలోని వినూత్న అంకుర సంస్థలు, వ్యాపార సంస్థలుతో పాటు లాభాపేక్షలేని మరో విభాగంలో ప్రభుత్వ సంస్థలు, దాతృత్వ సంస్థలు, ఛారిటబుల్‌ ట్రస్ట్‌లు, కమ్యూనిటీ ఫౌండేషన్‌లు, ఎన్‌జీఓలు, కార్పొరేట్‌ ఫండ్‌లు వంటి సంస్థలకు ఈ అవార్డులను అందించనున్నామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 17 చివరి తేదీ అని, ఔత్సాహిక ఆవిష్కర్తలు ఎంట్రీలను అధికారిక వెబ్‌సైట్‌  https:// form. jotform.com/ MIFAwards/ mif& innovation& for& india& awards& app  ద్వారా సమర్పించాలని సూచించారు.    

సింక్రోనీకి ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ పురస్కారం...
సానుకూల, ఉద్యోగ–కేంద్రీకృత సంస్కృతిని పెంపొందించడం ద్వారా మాదాపూర్‌లోని ప్రముఖ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కంపెనీ సింక్రోనీ దేశంలో పనిచేసేందుకు ఎంచుకోదగ్గ అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇన్‌ ఇండియా పురస్కారం దక్కించుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు సోమవారం తెలిపారు. ఏడేళ్లుగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నామని,  ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తమ ఉద్యోగులు పూర్తి సామర్థ్యాన్ని వెచి్చంచేలా ప్రోత్సహిస్తుండడమే ఈ ఘనతకు కారణమని వివరించారు.   

27న ఇన్‌ఫ్యూజన్‌.. షో
నగరానికి చెందిన ఇన్‌ఫ్యూజన్‌ రాక్‌ బ్యాండ్‌ ప్రదర్శన గురువారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.36లోని గ్రీస్‌ మంకీ రెస్టారెంట్‌ ఆవరణలో ఈ కార్యక్రమం ఉంటుంది. విభిన్న సినీ, ప్రైవేట్‌ గీతాలతో పాటు సొంతంగా సమకూర్చిన ఆల్బమ్స్‌ ద్వారా కూడా పాప్యులరైన ఈ బ్యాండ్‌కు నగరంలో తగినంత పాపులారిటీ ఉంది. రెస్టారెంట్‌లో ఈ బ్యాండ్‌ ప్రదర్శన రాత్రి 8గంటల నుంచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  

బెస్ట్‌ ఫ్యాషన్‌ షో నిర్వాహకునిగా జోసెఫ్‌ సుందర్‌...
‘మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో పాటు ర్యాంప్‌పై వారి అందాన్ని మెరిపించే విధంగా నడిపించడంలో కొరియోగ్రాఫర్‌ పాత్ర అత్యంత కీలకం’ అని చెప్పారు జోసెఫ్‌ సుందర్‌. నగరంలో జరిగే ఫ్యాషన్‌ కొరియోగ్రాఫర్‌/ఫ్యాషన్‌ షో నిర్వాహకులు జోసెఫ్‌ సుందర్‌ తాజాగా తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ఇండస్ట్రీ (టీసీఇఐ)ఆధ్వర్యంలో బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌/షో ఆర్గనైజర్‌గా అవార్డ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ వరుసగా ఐదోసారి ఈ అవార్డ్‌ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఫ్యాషన్‌ రంగంతో మమేకమై సాగుతున్న తన ప్రయాణంలో 2వేలకు పైగా ఫ్యాషన్‌ ప్రదర్శనలు నిర్వహించానని, మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు అనేక ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో జడ్జిగా వ్యవహరించానన్నారు. నగరంలో మోడలింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, అయితే యువత ఆషామాïÙగా కాకుండా దీన్నొక ప్రొఫెషన్‌గా స్వీకరించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement