తెలంగాణలో కొత్తగా 1,050 పాజిటివ్‌ కేసులు | 1050 New Coronavirus Positive Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,050 పాజిటివ్‌ కేసులు

Nov 14 2020 9:27 AM | Updated on Nov 14 2020 9:27 AM

1050 New Coronavirus Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,002 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,050 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,56,713కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,401కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

నిన్న ఒక్క రోజే 1,736 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,38,908కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,404 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 13,867 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 48,53,169కి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement