తమిళసినిమా: మండే ఎండల్లో గుండెలను తాకే చల్లదనంలా ,ప్రేమ, సంతోషం, మనసులను పిండే భావోద్వేగ సన్నివేశాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చిత్ర టీజర్ ప్రేక్షకులను రొమాంటిక్ అనుభవాన్ని కలగజేస్తోందని ఆ చెత్త యూనిట్ పేర్కొన్నారు. చెల్లమే వంటి మంచి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు ఏఆర్ గాంధీకృష్ణ చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన తాజా చిత్రం బ్రేక్ ఫాస్ట్. యాక్సెప్ట్ ది రియాలిటీ అనే ట్యాగ్ తో నువ్వు పొందిన ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ రాణవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నటి రోస్మిన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల నటి రీమాసేన్ విడుదల చేశారు. ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్న ఆనందాన్ని చిత్ర యూనిట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వ్యక్తం చేశారు. నటుడు సంపత్ కుమార్, నటి కస్తూరి, అర్చన, కృతిక మోహన్, అమిత రంగనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ క్లాసిక్ పిక్చర్స్ ప్రతాపంపై గిరిజ వరదరాజ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని ఎంవీ పన్నీర్ సెల్వం చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ తరం ప్రేమ బ్రేకప్ వంటి అంశాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా టైలర్, చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.


