సాక్షి, చైన్నె : చైన్నెలోని ప్రముఖ షాపింగ్, వినోద కేంద్రంగా ఉన్న ఫీనిక్స్ మార్కెట్‌సిటీలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ ‘హాలిడే ల్యాండ్’ పేరుతో వినూత్న వేడుకను ప్రారంభించారు. మడగాస్కర్ థీమ్‌తో రూపొందించిన ఈ ఉత్సవం మొత్తం మాల్‌ను సర్కస్, షాపింగ్ , కుటుంబ వినోదంతో కూడిన ఒక రంగుల ప్రపంచంగా మార్చేసింది. ఈ అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకతో ఫీనిక్స్ మార్కెట్‌సిటీ సరికొత్తగా మారింది. మాల్‌లోకి అడుగుపెట్టిన సందర్శకులకు ఆఫ్రో జంగిల్ డ్యాన్స్ ప్రదర్శనలు, శక్తివంతమైన సర్కస్ విన్యాసాలు, మడగాస్కర్ పాత్రల మాస్కట్‌లు , పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టివిటీ జోన్‌లు సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖ డిజిటల్ క్రియేటర్ వీజే సిద్ధు ప్రత్యేక అతిథిగా హాజరై సందర్శకులను అలరించారు. యువ అభిమానులతో ఆయన ముచ్చటించారు.గ్రాండ్ లాంచ్ సందర్భంగా జరిగిన కౌంట్‌డౌన్ , లైటింగ్ సెర్మనీతో ‘హాలిడే ల్యాండ్’ ఇన్‌స్టాలేషన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ వారాంతంలో ‘సింగ్ అలాంగ్ చైన్నె’ మ్యూజికల్ బ్యాండ్ ప్రదర్శనలు , కొనసాగుతున్న సర్కస్ విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి.


