అత్యాధునిక వైద్య పరికరాల వితరణ | - | Sakshi
Sakshi News home page

అత్యాధునిక వైద్య పరికరాల వితరణ

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

– అందజేసిన సిల్వర్‌జూబ్లీ ట్రస్ట్‌

కొరుక్కుపేట: మద్రాసు నార్త్‌ లయన్స్‌ క్లబ్‌ సిల్వర్‌ జూబ్లీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చైన్నె వెస్ట్‌ మాంబలంలోని ప్రజారోగ్య కేంద్రానికి విలువైన అత్యాథునిక వైద్య పరికరాలు అందించారు. ట్రస్టీలు లయన్‌ వైవి హరికృష్ణ, లయన్‌ పీజే పీఎన్‌ గుప్తా సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో మాంబళంలోని ప్రజారోగ్య కేంద్రానికి చేరుకున్న ట్రస్టీలు పెథాలజీ వైద్య పరికరాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ వల్లినాయగం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో మద్రాసు నార్త్‌ లయన్స్‌ క్లబ్‌ సిల్వర్‌ జూబ్లీ ట్రస్ట్‌ వారు అత్యాధునిక వైద్య పరికరాలు అందించటంపై ట్రస్టీలను అభినందించారు. అలాగే ప్రజారోగ్య కేంద్రం వైద్యలు బృందం సైతం మద్రాసు నార్త్‌ లయన్స్‌క్లబ్‌ సిల్వర్‌ జూబ్లీ ట్రస్టీలకు, మద్రాసు నార్త్‌ లయన్స్‌ క్లబ్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖలు లయన్‌ రఘురామ్‌ , లయన్‌ విఠ్ఠల్‌ , లయన్‌ జగదీష్‌ చందర్‌, లయన్‌ పార్థసారధి, లయన్‌ నందగోపాల్‌ , లయన్‌ పిచ్చాండి, జె.హరికృష్ణ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement