లారీ నుంచి జారిపడ్డ ఇనుప రోలర్‌ | - | Sakshi
Sakshi News home page

లారీ నుంచి జారిపడ్డ ఇనుప రోలర్‌

Feb 8 2026 7:11 AM | Updated on Feb 8 2026 7:11 AM

లారీ నుంచి జారిపడ్డ ఇనుప రోలర్‌

లారీ నుంచి జారిపడ్డ ఇనుప రోలర్‌

● తప్పిన ప్రమాదం

తిరువళ్లూరు: తిరుత్తణి నుంచి చైన్నె వైపు లారీలో వెళ్తున్న ఇనుము రోలర్‌ హఠాత్తుగా కిందపడడంతో ట్రాపిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలోని ప్రవేటు పరిశ్రమ నుంచి రెండు ఇనుము రోలర్‌లతో లారీ శనివారం ఉదయం బయలుదేరింది. రోలర్‌ లారీ నుంచి జారి కిందపడకుండా రెండువైపులా గొలుసుతో కట్టారు. అయితే లారీ తిరువళ్లూరు సమీపంలోని తిరుప్పాచ్చూర్‌ వద్ద వస్తుండగా స్పీడ్‌బ్రేక్‌ను దాటే క్రమంలో రోలర్‌ జారీ కిందపడి సుమారు 10 మీటర్లు దూరం మేరకు ముందుకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు తమ వాహనాలను అక్కడే నిలిపి వేయడంతో ప్రమాదం తప్పింది. కాగా రోలర్‌ కిందపడి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడడంతో వాహనాలు బారులుదీరి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తాలుకా పోలీసులు క్రేన్‌ సాయంతో రోలర్‌ను తొలగించి ట్రాఫి్‌్‌క్‌ను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement