మద్యానికి వ్యతిరేకంగా కుయిలి | - | Sakshi
Sakshi News home page

మద్యానికి వ్యతిరేకంగా కుయిలి

Jun 9 2025 7:01 AM | Updated on Jun 9 2025 7:01 AM

మద్యానికి వ్యతిరేకంగా కుయిలి

మద్యానికి వ్యతిరేకంగా కుయిలి

తమిళసినిమా: కుటుంబాలను కష్టాల కడలిగా మార్చే మద్యానికి వ్యతిరేకంగా ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం కుయిలి. బియం. ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై వీవీ అరుణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మురుగస్వామి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బాలాజీ శక్తివేల్‌ శిష్యుడు కావడం గమనార్హం. ఈ చిత్రం జూలైలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. వీసీకే పార్టీ నేత తోల్‌ తిరుమావళవన్‌, దర్శకుడు బాలాజీ శక్తివేల్‌, నటుడు డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కే.రాజన్‌ పాల్గొని కుయిలి చిత్ర ట్రైలర్‌, పాటలు బాగున్నాయని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ మద్యానికి వ్యతిరేకంగా ఒక తల్లి చేసే పోరాటమే కుయిలి అని చెప్పారు. కన్న తండ్రి, కట్టుకున్న భర్త ఇద్దరు మద్యానికి బానిసలైతే ఆ మహిళ జీవితం ఏమైంది, ఆమె తన కొడుకును ఎలా పెంచింది? మద్యం కారణంగా తన లాగా ఇతర మహిళలు బాధింపునకు గురి కాకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కుయిలి అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన విజీ ఆంథోని చాలా అద్భుతంగా నటించారని, ఇది సహజత్వానికి దగ్గరగా రూపొందించిన కథా చిత్రమని, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement