
పది విమానాల సేవల రద్దు
సాక్షి, చైన్నె : చైన్నె నుంచి కొచ్చి, హైదరాబాద్, ఢిల్లీ, పుణె తదితర ప్రాంతాలకు బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి వరకు బయలు దేరాల్సిన పది విమానాల సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సేవలను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్వహణా కారణాలతోనే వీటి సేవలను రద్దు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొంటున్నాయి. రద్దయిన విమానాలలో చైన్నె నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ బయలు దేరాల్సిన విమానం, రాత్రి 8.35కు కొచ్చి బయలు దేరాల్సిన విమానం, 9.20కు పుణె బయలు దేరాల్సిన విమానం, 9.45కు ఢిల్లీ, 9.50కు హైదరాబాద్ బయలు దేరాల్సిన విమానాలు ఉండటం గమనార్హం. రద్దయిన విమానాలలో ఏర్పాట్లు చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.