
నయన్ మరోసారి ద్విపాత్రాభినయం
తమిళసినిమా: నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్‌ఖాన్‌కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 ఒకటి. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పా త్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్‌లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశా రు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్‌గా ఉంటాయని సమాచారం.
నయనతార