
నా తదుపరి చిత్రం ఎప్పుడంటే..
అజిత్
తమిళసినిమా: నటుడు అజిత్ ఇటీవల చాలా ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మంచి విజయాన్ని సాధించడం ఒక ఎత్తు అయితే, అంతర్జాతీయ స్థాయి కార్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో విజేతగా నిలవడం మరో కారణం. అజిత్ ఇటీవల కార్ రేసులపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారన్నది తెలిసిన విషయమే. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈయన పూర్తిగా కార్‌రేస్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం 40 కిలోల వరకు బరువు తగ్గి, పూర్తిగా ఫిట్‌నెస్‌గా మారారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం గత ఏప్రిల్ 10వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అజిత్ నటించే తదుపరి చిత్రం అప్డేట్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఒక గుడ్ న్యూస్ చెబుతూ అజిత్ ఇటీవల భేటీలో వచ్చే నవంబర్‌లో తన నూతన చిత్రం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆ చిత్రం 2026 ఏప్రిల్‌గానీ, మే నెలలో గానీ తెరపైకి వస్తుందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా తనకు కార్ రేస్‌ల్లో పాల్గొనడం అంటే ఆసక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అయితే కార్ రేస్‌ల్లో పాల్గొంటూ సినిమాల్లో నటించడం అంత సులభం కాదన్నారు. తన మాదిరిగానే తనతో చిత్రాలు చేస్తే దర్శక నిర్మాతలు కూడా అదే భావంతో ఉండడంతో ప్రస్తుతం తాను కార్ రేస్‌లపైనే పూర్తిగా కాన్స్‌స్ట్రేషన్ చేస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో మళ్లీ నటించడానికి సిద్ధమవుతానని అజిత్ పేర్కొన్నారు. దీంతో ఆయన నటించే చిత్రం ఏ సంస్థలో ఉంటుంది, దర్శకుడు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చిత్రాలు చేయడానికి నటుడు ధనుష్‌తో సహా పలువురు దర్శకులు లైన్‌లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.

నా తదుపరి చిత్రం ఎప్పుడంటే..