
నర్సులు సేవాభావం కలిగి ఉండాలి
వేలూరు: నర్సింగ్ సిబ్బంది సేవా భావం కలిగి ఉండాలని సినీ నటి నళిని అన్నారు. వేలూరు సమీపంలోని శ్రీపురం బంగారుగుడి పీఠాధిపతి శ్రీశక్తిఅమ్మ ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ నారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లుల దినోత్సవం, నర్సుల దినోత్సవాన్ని ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సులు చేసే సేవ మరవలేనిదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని డాక్టర్‌ల కన్నా ముందుగా నర్సులే చూస్తా రని వారితో ప్రేమతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందజేయాలన్నారు. నర్సులు ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకుండా సేవభావంతో చూడాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడడం తోనే వారికి సగం రోగం నయం అవుతుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రతి ఒక్కరూ స్నేహ పూర్వకంగా కుటుంబ సభ్యుల తరహాలో వ్యవహ రించాలన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందజే సిన నర్సులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంత రం సినీనటి నళినికి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ జ్ఞాపిక ను అందజేసి. సన్మానించారు. కార్యక్రమంలో డివైన్ సుకీ గ్రూప్స్ డైరెక్టర్‌లు శ్రీకాంత్, శ్రీనాథ్, ఇండియన్ స్పోర్ట్స్ కమ్మాడేటర్ రవి చదుర్‌వేది, ఇండియన్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ గీత, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ శక్తివేలన్, నర్సింగ్ కళాశాల మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ మాధవి, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.