తరమణిలో భారీ గొయ్యి! | - | Sakshi
Sakshi News home page

తరమణిలో భారీ గొయ్యి!

May 19 2025 2:18 AM | Updated on May 19 2025 2:18 AM

తరమణిలో భారీ గొయ్యి!

తరమణిలో భారీ గొయ్యి!

● దూసుకెళ్లిన కారు ● స్తంభించిన ఓఎంఆర్‌

సాక్షి, చైన్నె: తరమణి సమీపంలో రోడ్డుపై భారీ గొయ్య ఏర్పడింది. ఇందులోకి ఐదుగురు ప్రయాణికులతో కూడిన కారు దూసుకెళ్లింది. వీరిని అతి కష్టం మీద రక్షించారు. ఈ ఘటనతో ఓఎంఆర్‌ మార్గం స్తంభించినట్టైంది. వివరాల్లోకి వెళితే.. చైన్నె ఓఎంఆర్‌ మార్గంలో మెట్రో రైలు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మార్గం నిత్యం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంటోంది. ఈ మార్గంలో తరమణి జంక్షన్‌కు కూత వేటు దూరంలో హఠాత్తుగా రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. పది అడుగుల మేరకు ఏర్పడిన ఈ గొయ్యి లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఇందులో ఇద్దరు మహిళలు, పిల్లలతో సహా ఐదుగురు ఉన్నారు. రోడ్డు మీద వెళుతున్న వారు, ఆ పరిసరాల్లో విధుల్లో ఉన్న పోలీసులు పరుగులు తీసి, కారును అతి కష్టం మీద బయటకు తీశారు. అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. అయితే, డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఓఎంఆర్‌ మార్గం స్తంభించినటైంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడిన సమాచారం ఆ పరిసరాలలో కలకలం రేపింది. తరచూ చైన్నెలో ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తరమణి వద్ద జరిగిన ఘటనతో ఆ పరిసర వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement