
మోడల్ స్కూలు పనుల పరిశీలన
తిరువళ్లూరు: పట్టాభిరామ్‌లో రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ పాఠశాల, విల్లివాక్కంలో నిర్మిస్తున్న గ్రీనరీ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వేపంబట్టు, సెవ్వాపేటలో ప్రారంభమైన రైల్వే బ్రిడ్జి పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ పట్టభిరామ్‌లో నిర్మిస్తున్న మోడల్ స్కూల్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ తనిఖీల్లో పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ దేవన్, చీఫ్ ఎడ్యుకేషన్ అధికారి(ఇన్‌చార్జ్) మోహన పాల్గొన్నారు.