
వివాదానికి తెర పడేదెన్నడో?
సాక్షి, చైన్నె: పీఎంకేలో అధ్యక్ష పదవి వ్యవహారంలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. తానే అధ్యక్షుడ్ని అని రాందాసు, కాదు..కాదు తానే అధ్యక్షుడ్ని అంటూ అన్బుమణి పరస్పరం కయ్యానికి కాలుదువ్వే రీతిలో వ్యవహరిస్తుండడం ఆ పార్టీలోని జిల్లాల నేతలను సందిగ్ధంలో పడేసింది. పార్టీ భవిష్యత్తు అన్బుమణిగా ఉన్నప్పటికీ, పార్టీ వ్యవస్థాపకుడ్ని వదలుకునే పరిస్థితులలో లేక అనేక మంది నేతలు సతమతం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
రెండవ రోజూ డుమ్మా..
జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నేతలు సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో రెండవ రోజు యువజన విభాగం భేటీ సైతం అదే బాటకు దారి తీసింది. యువజన నేతలు పెద్దగా ఎవ్వరూ రాందాసు నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. పదుల సంఖ్యలో నేతలు రావడం, పార్టీ ప్రధాన కార్యదర్శి వడి వేలురావన్ మినహా తక్కిన రాష్ట్ర స్థాయి నేతలు కనిపించక పోవడం చర్చకు దారి తీసింది. అన్బుమణిని దూరం చేసుకోవడం ఇష్టంలేక యువజన నేతలందరూ ఈ సమావేశానికి గైర్హాజరైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎవరు వచ్చినా రాకున్నా, పార్టీ పరంగా 2026 ఎన్నికలలో తానే తుది నిర్ణయం తీసుకుంటానని, తన సారథ్యంలో పార్టీ వర్గాలు ఎన్నికలకు సమాయత్తం కావాలని రాందాసు ఆదేశించడం గమనార్హం. అదే సమయంలో రానున్న ఎన్నికలలో కూటమి ఉంటుందని, అది ఎవరితో అన్న నిర్ణయం కూడా తానే తీసుకుంటానని రాందాసు స్పష్టం చేయడంతో పీఎంకే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం పీఎంకే గౌరవ అధ్యక్షుడు జీకేమణి నేతృత్వంలోని బృందం అన్బుమణితో భేటీ అయ్యింది. ఈ భేటీ అనంతరం జీకేమణి స్పందిస్తూ, పార్టీలో సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నది వాస్తవమేని పేర్కొంటూ, అన్నీ త్వరలో సమసి పోతాయన్నారు. పార్టీలో అందరూ ఒక్కటేనని, అందరు మళ్లీ ఒక చోట చేరుతారని, అన్బు సైతం సమావేశాలకు వస్తారని ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
తెర పడేనా..?
రాందాసు నేతృత్వంలో జరిగే భేటికి వెళ్తే, అన్బుమణి ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి ఉంటుందో అన్న ఆందోళనతో శుక్రవారం జరిగిన భేటీకి సుమారు యాభైకు పైగా జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు డుమ్మా కొట్టినట్టు సమాచారం వెలువడింది. అన్బుమణికి మద్దతుగా తాము ఉన్నప్పటికీ, వ్యవస్థాపకుడికి వ్యతిరేకంగా వ్యవహరించ లేని పరిస్థితులలో ఈ నేతలందరూ తమలో తాము మదన పడుతూ తండ్రి, తనయుడి మధ్య సఖ్యత కుదరాలన్న ఎదురు చూపులలో పడ్డాయి. అదే సమయంలో ఈ వివాదం ఇలాగే కొనసాగిన పక్షంలో కేడర్‌లో గందరగోళం తప్పదని, ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని మరికొందరు హెచ్చరిస్తుండడం గమనార్హం.
పీఎంకే వర్గాల అయోమయం
యువజన విభాగం భేటీకి సైతం నేతల డుమ్మా
అన్బుమణితో జీకే మణి సమావేశం
త్వరలో అన్ని అడ్డంకులు తొలగుతాయని వ్యాఖ్య
పీఎంకేలో అధికార వార్‌కు తెర పడెదెన్నడో అని ఆ పార్టీ వర్గాలు ఎదురు చూపుల్లో పడ్డారు. ఓ వైపు తండ్రి, మరోవైపు తనయుడి మధ్య నేతలు నలిగి పోవాల్సిన పరిస్థితి
రావడంతో రాయబారాలపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. అన్బుమణితో పార్టీ గౌరవ అధ్యక్షుడు జికే మణి నేతృత్వంలోని బృందం శనివారం చైన్నెలో భేటీ అయింది. అదే
సమయంలో తైలాపురంలో రెండవ రోజు
జరిగిన యూత్ భేటికి అన్బుమణి ,
మద్దతు యువత డుమ్మాకొట్టడం
చర్చకు దారి తీసింది.