
డెల్టాలో జోరు వానలు
సాక్షి, చైన్నె : డెల్టాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో ఐదురోజులు ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ ఏడాది వేసవిలో భానుడి ప్రతాపం గురించి చెప్పనక్కర్లేదు. మరో రెండు వారాలలొఓ అగ్ని నక్షత్రం సీజన్ ముగియనున్నది. అయితే, నైరుతి రుతు పవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నడంతో పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలో వాతావరణం ప్రస్తుతం చల్లబడింది. అక్కడక్కడ అకాల వ ర్షం పలకరిస్తున్నది. నైరుతీ పవనాలు అండమాన్ తీరాన్ని తాకిన దృష్ట్యా, ప్రస్తుతం డెల్టా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడుతోంది. తిరుచ్చి, పెరంబలూరు, నాగపట్నం, తిరువా రూర్,తంజావూరు, మైలాడుతురై జిల్లాలో వ ర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం నుంచి ధర్మపురి, కృష్ణగిరి, వేలూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలైలోనూ వర్షాలు పడుతాయని ప్రకటించింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక జిల్లాలో భానుడి సెగ తగ్గినట్లయ్యింది. అదే సమయంలో ఇక వేసవి కాలం సీజన్ ముగిసినట్టే అని ప్రై వేటు వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు.
నాలుగు ముసాయిదాలకు గవర్నర్ ఆమోదం
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఆమోదం పొందిన నాలుగు ముసాయిదాలకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులను రాజ్ భవన్‌కు గవర్నర్ పరిమితం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తూ వచ్చారు.ఈ పరిస్థితులలో గత నెల వర్సిటీలకు సంబంధించిన పది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొన్ని కీలక ముసాయిదాల మీద రాజ్ భవన్ త్వరిత గతిన నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో పలు ముసాయిదాలను ఆమోదించారు. ఇందులో నాలుగు ముసాయిదాలను గవర్నర్ ఆమోదించినట్టు శనివారం రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఆర్థిక పరమైన బిల్లులు ఇందులో ఉన్నాయి. ఇక,మరో 14 ముసాయిదాలు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
వైరముత్తుకు సీఎం పరామర్శ
సాక్షి, చైన్నె : సినీ రచయిత వైరముత్తును సీఎం ఎంకే స్టాలిన్ పరామర్శించారు. వైరముత్తు మాతృమూర్తి అంగముత్తు ఇటీవల కాలం చెందారు. ఈ సమయంలో సీఎం స్టాలిన్ నీలగిరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఊటీ నుంచి శుక్రవారం రాత్రి చైన్నెకు సీఎం చేరుకున్నారు. శనివారం ఉదయాన్నే ఎంపీలు టీఆర్ బాలు, ఏ రాజ, మంత్రి శేఖర్‌బాబుతో కలిసి బీసెంట్ నగర్‌లోని వైరముత్తు నివాసానికి వెళ్లారు. ఆయన్ని కలిసి తన సానుభూతిని తెలిపారు. అనంతరం సీఎం స్టాలిన్ డీఎంకే సీనియర్ నేత ఎస్‌ఎం రామచంద్రన్ ఇంటికి వెళ్లారు. 100వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు.
అత్యాచారం కేసులో కార్మికుడికి జీవిత ఖైదు
అన్నానగర్: వివాహం పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కార్మికుడికి జీవిత ఖైదు, అతడి స్నేహితురాలు అయిన బాలిక తల్లికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ దిండుక్కల్ జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు.. దిండుక్కల్ జిల్లా వడమదురైకి చెందిన శివకుమార్ (39)కార్మికుడు. 2021లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి బాలిక తల్లి కూడా సహకరించిందని తెలుస్తోంది. ఈ విషయంలో, ఉత్తర మధురై ఆల్ ఉమెన్స్ పోలీసులు కేసు నమోదు చేసి శివకుమార్, బాలిక తల్లిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ దిండుక్కల్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి వేల్ మురుగన్ సమక్షంలో జరుగుతోంది. దర్యాప్తు ముగిసిన తరువాత, న్యాయమూర్తి వెల్ మురుగన్ శనివారం తన తీర్పును వెలువరించారు. అందులో బాలికపై అత్యాచారం చేసిన శివకుమార్‌కు జీవిత ఖైదు, రూ.లక్ష 12 వేలు జరిమానా విధించారు. స్నేహితురాలైన అయిన బాలిక తల్లికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు.
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి
అవయవాలు దానం
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా పులియంబట్టి గ్రామంలోని కాలియమ్మన్ ఆలయం వీధికి చెందిన మాదేశ్వరన్(40) నర్సుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాదేశ్వరన్ ఈనెల 15న తిరువణ్ణామలై జిల్లా సెంగం వద్ద బైకులో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలైన మాదేశ్వరన్‌ను వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. దీంతో అతన్ని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో అతన్ని కిడ్నీ రాణిపేట సీఎంసీ ఆసుపత్రికి, మరొక కిడ్నీ శ్రీనారాయణి ఆసుపత్రికి, గుండెను చైన్నెలోని అపోలో ఆసుపత్రికి దానంగా అందజేసినట్లు వేలూరు సీఎంసీ ఆసుపత్రి నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

డెల్టాలో జోరు వానలు