
టెన్త్ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థుల సత్తా
పళ్లిపట్టు: టెన్త్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం విడుదల కాగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. సుందరేశనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాస్థాయి ప్రథమ స్థానం సాధించి, సత్తా చాటా రు. పళ్లిపట్టు యూనియనన్ అత్తిమాంజేరిపేట లోని సుందరేశనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి మణిమారన్ 495 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాస్థాయి ప్రథమస్థానం సాధించగా, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని సెల్వశ్రీ 494 మార్కులతో రెండో స్థానం కై వసం చేసుకుంది. అలాగే కోనసముద్రం ఎరుంబి, ఆదివరాహపురం, కరింబేడు, మామండూరు, నల్లవానంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

టెన్త్ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థుల సత్తా