
మోదీ గుండెలో పన్నీర్‌కు ప్రత్యేక స్థానం
వేలూరు: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంకు ప్రధాని మోదీ గుండెలో ప్రత్యేక స్థానం ఉందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తిరువణ్ణామలైలోని అన్నామలైయార్‌ను దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యులు ఆయన కు ప్రత్యేక దర్శనం కల్పించి, ఆలయ సంప్రదా యం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను ఆయన కు అందజేశారు.
అనంతరం ఆయన ఆలయం వెలుపుల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి వారి అధికారాన్ని ఉపయోగించి, సుప్రీంకోర్టును పలు ప్రశ్నలు అడిగారని, అయితే వీటిని తమిళనాడులోని కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రపతి అడిగిన 14 ప్రశ్నల్లో ఎటువంటి తప్పులేదనే విషయాన్ని తమిళులు తెలుసుకోవాలన్నారు. ఇప్పటివరకు రాజ్యాంగ చట్టం 143 ఐని ఉపయోగించి రాష్ట్రపతి 15 సార్లు సుప్రీంకోర్టును ప్రశ్నలు అడిగారన్నారు. తమిళనాడుకు 205 టీఎంసీ నీటిని ఇవ్వాలని కావేరి మేనేజ్‌మెంట్ బృందం తీర్పు నిచ్చిందని, అయితే అప్పటి కర్ణాటక సీఎం బంగారప్ప తమిళనాడుకు నీటిని ఇచ్చేందుకు కుదరదని, అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. తమిళనాడులో బీజేపీ కూటమి బలంగా ఉందని, అయితే డీఎంకే కూటమి ఇంకనూ అనుమానంగానే ఉందన్నారు. తమిళనాడు హత్యా రాష్ట్రంగా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. దీంతోనే 2026వ సంవత్సరం జరిగే ఎన్నికల్లో డీఎంకేను రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు.