
తిరువళ్లూరు జిల్లాలో 89.60 శాతం
● ప్లస్–1లో 87.39 శాతం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లాలో పది ఫలితాల్లో 89.60 శాతం మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఏడాది 3.76 శాతం ఎక్కువ. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 31,305 మంది పరీక్షలకు హాజరయ్యారు. బాలురు 86.93 శాతం, బాలికలు 92.25 శాతం మొత్తం 89.60 శాతం మందిఉత్తీర్ణత సాధించారు.
ప్లస్–1లో 87.39 శాతం ఉత్తీర్ణత
తిరువళ్లూరు జిల్లాలో ప్లస్–1 పరీక్ష ఫలితాల్లో 87.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్లస్–1 పరీక్షలను జిల్లాలో 29,234 మంది రాశారు. 11,479 మంది బాలురు, 14,068 బాలికలు మొత్తం 25,574 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికంటే 1.85 శాతం పెరిగింది.