
అదుపుతప్పిన లారీ
●ముగ్గురికి తీవ్రగాయాలు ●ఆరు వాహనాలు ధ్వంసం
తిరువొత్తియూరు: లారీ అదుపుతప్పి దూసుకెళ్లడంతో ముగ్గురు గాయపడ్డారు. ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈఘటన చైన్నె, మూలక్కడ కూడలి వంతెన వద్ద చోటుచేసుకుంది. చైన్నె మాధవరం రౌండ్‌టానా నుంచి మూలక్కడై వైపు బుధవారం రాత్రి లారీ వెళుతోంది. మూలక్కడై వంతెన కింద కూడలి వద్ద వెళుతుండగా హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో, నాలుగు బైకులు, లగేజీ వ్యాన్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో ఆటో ధ్వంసమైన సంఘటనలో ఒక వృద్ధురాలికి, బైక్‌లో కూర్చుని ఉన్న బిడ్డ ,రోడ్డుపై నడిచి వెళుతున్న జయకుమార్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మాధవరం ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లి గాయపడిన వారిని స్టాన్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ విజయ్ (35)ను స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పుళల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పళ్లికొండేశ్వరుడి సేవలో ఉడిపి పీఠాధిపతి
నాగలాపురం: మండలంలో సురుటుపల్లిలోని పళ్లికొండేశ్వరస్వామిని ఉడిపి పీఠాధిపతి ఈషా ప్రియ తీర్థ స్వామీజీ, తన శిష్య బృందంతో దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారుల స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి ఆలయ ప్రదోష మండపంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు
●టీవీకే స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రకటించింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రిక ళగం బలోపేతం దిశగా ప్రజలలోకి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సాగిన ఓ సర్వేలో సైతం విజయ్ సత్తా చాటుకుంటారన్నది స్పష్టమైంది. అదే సమయంలోఅన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కూటమిలోకి విజయ్‌ను ఆహ్వానించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు గత కొద్ది రోజులుగా చర్చ జోరందుకుంది. ఇందుకు సమాధానం ఇస్తూ గురువారం తమిళగ వెట్రి కళగం డిప్యూటీ ప్రధానకార్యదర్శి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకునేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమిళ వెట్రి కళగం నేతృత్వంలోనే కూటమి ఉంటుందని వ్యాఖ్యానించారు. కూటమిలోకి ఎవ్వర్వెరు వస్తారో, పొత్తుల కసరత్తు గురించి త్వరలో తమ నేత విజయ్ ప్రకటిస్తారన్నారు. బీజేపీతో పొత్తు లేదని, తమ మహానాడులోనే స్పష్టంగా సిద్ధాంతాలను ప్రకటించామన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వారితో పొత్తులు ఉండవని స్పష్టంచేశారు.
రాయిని ఢీకొన్న కారు
నాగలాపురం: మండలంలోని చిన్నాపట్టు వద్ద పుత్తూరు–చైన్నె హైవే పక్కన రాయిని కారు ఢీకొంది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తమిళనాడులోని కొలత్తూరుకు చెందిన ఇద్దరు కారులో తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి తిరిగి చైన్నెకి బయలుదేరారు. మార్గమధ్యంలో చిన్నాపట్టు గ్రామం వద్ద కారు అదుపుతప్పి హైవే పక్కన ఉన్న రాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు ముందు భాగం మాత్రం దెబ్బతింది.

అదుపుతప్పిన లారీ