
కనులపండువగా ఉత్సవశాంతి అభిషేకం
వేలూరు: వేలూరు బ్రాహ్మణ సంఘం, సౌత్‌జోన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లోక క్షేమం కోసం వేలూరు కోట మైదానంలోని అఖిలాండేశ్వరి సమేత జలకంఠేశ్వరస్వామికి ఉత్సవ శాంతి అభిషేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు వేలూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాజా, సౌత్‌జోన్ సంఘం ప్రధాన కార్యదర్శి, సౌత్‌జోన్ పురోహితుల సంఘం కోశాధికారి శేఖర్, రాష్ట్ర ఆర్గనైజర్ క్రిష్ణమూర్తి అధ్యక్షతన అధికసంఖ్యలో పురోహితులు ప్రత్యేక వేద మంత్రాలు చదివి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామి వారికి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక యాగ గుండం ఏర్పాటు చేసి వివిధ పుణ్య జలాలను తీసుకొచ్చి కలశాలలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఘం నిర్వాహకులు శ్రీనివాసన్, రామచంద్రన్, పురోహితుల నిర్వాహకులు, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.