
● సప్తవర్ణ పుష్పాలతో ఊటీ కనువిందు ● పర్యాటకం కిటకిట ● 1
సాక్షి, చైన్నె: తమిళనాడులోని నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ప్రకృతి రమణీయతకు రారాజుగా పేరుగడించిన ఈ ప్రాంతం ఎల్లప్పుడూ ఆహ్లాదకర వాతావరణంలో మునిగి ఉంటుంది. ఇక్కడి పర్యాటక అందాల్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో ఊటి పయనం ప్రత్యేక అనుభూతి. మేట్టుపాళయం నుంచి కున్నూరు మీదుగా ఊటీకి వెళ్లే ఈ రైలు కొండకోనల్లో ప్రయాణిస్తుంది. ఈ ప్రకృతి సీమలో ఏటా వేసవి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతుంటాయి. ఈ ఏడాది వేసవి ఉత్సవాలలో భాగంగా పుష్ప ప్రదర్శనకు నీలగిరి జిల్లా యంత్రాంగం, ఉద్యానవన, అటవీ , వ్యవసాయ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
పుష్ప ప్రదర్శన..
127వ పుష్ప ప్రదర్శనను రూ. 24.60 లక్షలతో ఏర్పాటు చేశారు. వేసవిలో నీలగిరి అందాలను ఆస్వాదించడానికి వస్తున్న పర్యాటకులకు కనువిందుగా ఈనెల 25 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ పుష్ప ప్రదర్శనలో పురాతన తమిళ రాజుల రాజభవనాలు. జీవనశైలిని చూపించే అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 70 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు ఉన్న అద్భుతమైన రాజభవనం ప్రవేశ ద్వారం డిజైన్ 1,30,000 పువ్వులతో తీర్చిదిద్దారు. 75 అడుగుల పొడవు , 25 అడుగుల ఎత్తు కార్నేషన్లు, గులాబీలు, బంతి పువ్వులు తదితర 2,00,000 పువ్వులతో పురాతన రాజభవన రూపొందించారు. అదనంగా, 8 అడుగుల పొడవు, 35 అడుగుల పొడవుతో బంతి పువ్వులు, గులాబీలతో రాజహంస, కుండలు మరింత వన్నె తెచ్చి ఉన్నాయి. పార్కులోని వివిధ ప్రాంతాలను పూర్తిగా పువ్వులతో అలంకరించారు. పురాతన సింహాసనం. ఊయల, అద్దం, సంగీత ఉపకరణాలు, ఫిరంగులు, ఏనుగు, పులి, చదరంగం సెట్ వంటి అనేక ఆకర్షణీయ అంశాలను పువ్వులతో తీర్చిదిద్దారు. ఈ ప్రదర్శనలో భాగంగా వివిధ కళా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఉదయం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. గార్డెన్ అంతా తిరుగుతూ పువ్వుల అలంకరణలను ఆస్వాధీస్తూ, రాజ భవనం సెట్‌లో పోటోలు దిగుతూ ఆనందంగా సీఎం స్టాలిన్ చక్కర్లు కొట్టారు.
రాజసంగా పొటోకు పోజు
కళా ప్రదర్శన

● సప్తవర్ణ పుష్పాలతో ఊటీ కనువిందు ● పర్యాటకం కిటకిట ● 1

● సప్తవర్ణ పుష్పాలతో ఊటీ కనువిందు ● పర్యాటకం కిటకిట ● 1