
● బిడ్దలను కడతేర్చి, దంపతుల బలవన్మరణం ● తిరుచ్చిలో విషా
సాక్షి, చైన్నె: అప్పుల భారంతో ఓ దంపతులు తమ ఇద్దరి బిడ్డలను కడతేర్చారు. ఆపై వారు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం తిరుచ్చిలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...తిరుచ్చి మేఘలా థియేటర్ ఎదురుగా ఉన్న ముకాంబికై నగర్‌కు చెందిన అలెక్స్(42) వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య విక్టోరియా(38), కుమార్తెలు ఆరాధన(9), ఆలియా(3) ఉన్నారు. విక్టోరియా రైల్వే ఉద్యోగి. పిల్లలు ఇద్దరూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అలెక్స్ అద్దె ఇంట్లో నివాసం ఉన్నప్పటికీ, మీనాక్షి నగర్‌లో ఒక సొంత ఇల్లు కొనడంతో అప్పుల భారం క్రమంగా పెరిగింది. అయితే విక్టోరియా తండ్రి తన పెన్షన్‌ను సాయంగా అందించడంతో కొంత మేరకు గట్టెక్కుతూ వచ్చాడు. అదే సమయంలో తంజావూరులో తన సమీప బంధువు ఒకరికి పూచీకత్తు ఇచ్చి మళ్లీ అప్పుల ఊబిలో అలెక్స్ పడ్డాడు. అలాగే తన తల్లికి క్యాన్సర్ బయట పడడంతో ఆమె చికిత్స కోసం అప్పులు చేయడం మొదలు పెట్టాడు. విక్టోరియా తండ్రి మరణించడంతో పెన్షన్ ఆగిపోయింది. అప్పులు పెరిగాయి. వస్త్ర దుకాణంలో నష్టం పెరిగింది.
బలవన్మరణం
అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరగడంతో బలవన్మరణానికి అలెక్స్ సిద్ధమయ్యాడు. తాను మరణిస్తే తన కుటుంబాన్ని వేధిస్తారన్న ఆందోళనలో పడ్డాడు. చివరకు మంగళవారం రాత్రి బిడ్డలు ఇరువురికి ఆ దంపతులు విషం కలిపిన ఆహారం తినిపించారు. వారు మరణించడంతో దంపతులు ఇద్దరు తలా ఓ గదిలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం అప్పు ఇచ్చిన వ్యక్తి ఒకరు ఆ ఇంటికి వచ్చాడు. ఎంతకూ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా, బిడ్డలు ఇరువురు మరణించి ఉండడం, అదే గదిలో అలెక్స్, మరో గదిలో విక్టోరియా ఉరి పోసుకుని వేలాడుతుండడంతో విషాదం చోటు చేసుకుంది. తిరుచ్చి అసిస్టెంట్ కమిషనర్ సతీష్‌కుమార్, పొన్ మలై ఇన్‌స్పెక్టర్ వెట్రివేల్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. వీరికి అప్పులు ఇచ్చిన వారు, వేధింపులకు గురి చేసిన వారి వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు.
కాటేసిన అప్పు