
రేపు పది, ప్లస్ ఒన్ ఫలితాలు
సాక్షి, చైన్నె: పదో తరగతి, ప్లస్ ఒన్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఒకే రోజు పదో తరగతి, ప్లస్‌ఒన్ ఫలితాలను ప్రకటించిన గడువు కంటే 3 రోజులు ముందుగానే విడుదల చేయడానికి విద్యా శాఖ చర్యలు తీసుకుంది. ప్లస్‌ఒన్‌కు మార్చి 5 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని 7,557 పాఠశాలల నుంచి 8,23,261 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 3,89,423 మంది బాలురు, 4, 28,946 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు, 4,755 మంది ప్రైవేటు అభ్యర్థులు, 137 మంది జైలు ఖైదీలు ఉన్నారు. ఇక, మార్చి 28 నుంచి ఏప్రిల్ 15 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు, వీరిలో 40 వేల 465 మంది ప్రైవేటు అభ్యర్థులు, 272 మంది ఖైదీలు ఉన్నారు.
ముందుగానే ఫలితాలు
ప్లస్‌టూ ఫలితాలను మే 8న ప్రకటిస్తామని చెప్పి రెండు రోజులు ముందుగానే ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గణితం, సైన్స్ సబ్జెక్టులో పెద్ద సంఖ్యలో వందకు వంద మార్కులు సాధించిన వారు ఉన్నారు. అదే సమయంలో సీబీఐఎస్‌ఈ ఫలితాలో ఈసారి గణితం, సైన్స్ సంబంధిత సబ్జెక్టులలో వందకు వంద శాతం అన్నది రాష్ట్రంలో తక్కువ కావడంతో ఇంజినీరింగ్ ఉన్నత విద్యా కోర్సుల్లో ఈ సారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధిక అవకాశాలు దక్కబోతున్నాయి. అదేసమయంలో నాన్ మొదల్వన్ పథకం మేరకు ఈ సారి ఆదిద్రావిడ, గిరిజన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అన్నది 96 శాతంగా నమోదు కావడంతో ఉన్నత విద్యా కోర్సుల సీట్లలో అత్యుత్తమ విద్యా సంస్థలలో చేరేందుకు ఈ విద్యార్థులకు అధిక అవకాశాలు పెరిగాయి. శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో పదో తరగతి, ప్లస్‌ఒన్ ఫలితాలను 19వ తేదీ నుంచి విడుదల చేయడానికి తొలుత నిర్ణయించారు. అయితే, మూడు రోజులు ముందుగానే ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 16వ తేదీ శుక్రవారం విద్యామంత్రి అన్బిల్ మహేశ్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. నుంగంబాక్కం కాలేజ్ రోడ్డులోని డీపీఐ ఆవరణలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను htt pr://www.difioc-ker.gov.in , www.rerutr.gov.intnrerutr.nic.in వెబ్‌సైట్‌లలో చూసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. పాఠశాల విద్యార్థులు తాము చదివిన పాఠశాలల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, విద్యార్థులు నమోదు చేసుకున్న సెల్‌ఫోన్ నంబర్లకు కూడా ఫలితాలను పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు.